logo

భూముల రీసర్వే వేగవంతం: కలెక్టర్‌

జిల్లాలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శివశంకర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి జిల్లా రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లతో రీసర్వే కార్యక్రమ ప్రగతిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

Published : 05 Oct 2022 03:53 IST

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే : జిల్లాలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శివశంకర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి జిల్లా రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లతో రీసర్వే కార్యక్రమ ప్రగతిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆర్‌ఓఆర్‌ పూర్తయిన 19 గ్రామాల్లో భూహక్కు పట్టాలు పంపిణీ చేసేందుకు మరోసారి పరిశీలన చేసి నివేదికలను ఆర్డీవోలు కలెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న 20 గ్రామాల్లో పది రోజుల్లో రీసర్వే పూర్తి చేయాలని, ఫైనల్‌ ఆర్‌వోఆర్‌ పెండింగ్‌లో ఉన్న గ్రామాల్లో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 13ఎ నోటిఫికేషన్‌ 35 గ్రామాలకు ఇచ్చామని, వాటికి సంబంధించిన భూమి విలువల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలన్నారు. మరో 19 గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ఫొటో చెకింగ్‌, అప్‌డేషన్‌ వెంటనే చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ వసంతబాబు, సర్వే సెటిల్‌మెంట్‌ ఇన్‌ఛార్జి ఏడీ కృష్ణకాంత్‌, ఏవో అనిల్‌కుమార్‌, ఆర్డీవోలు శేషిరెడ్డి, అద్దయ్య, రాజకుమారి, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని