logo

వర్షాల నేపధ్యంలో యూజీ పరీక్ష వాయిదా

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం జరగాల్సిన యూజీ రెండో సెమిస్టర్‌ రెండో భాష పరీక్షను అక్టోబరు 16కి వాయిదా వేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురవడంతో పరీక్ష వాయిదా

Published : 07 Oct 2022 06:08 IST

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం జరగాల్సిన యూజీ రెండో సెమిస్టర్‌ రెండో భాష పరీక్షను అక్టోబరు 16కి వాయిదా వేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురవడంతో పరీక్ష వాయిదా వేయాలని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఏఎన్‌యూ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఏసీˆఈ రెడ్డి ప్రకాశరావు తెలిపారు. మిగిలిన పరీక్షలన్నీ పాత షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని