logo

ఆర్జిత సేవలు భారం!

దక్షిణ భారదేశంలోనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో దర్శనంతో పాటు వివిధ రకాల ఆర్జిత సేవల ధరలు పెంచేశారు.

Published : 30 Nov 2022 04:40 IST

లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పెరిగిన ధరలు'

న్యూస్‌టుడే, మంగళగిరి, తాడేపల్లి: దక్షిణ భారదేశంలోనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో దర్శనంతో పాటు వివిధ రకాల ఆర్జిత సేవల ధరలు పెంచేశారు. ప్రభుత్వం ఆలయాల్లో ఆర్జిత సేవల రేట్లను పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. పెరిగిన రేట్ల వల్ల సామాన్య మధ్య తరగతి వర్గాల్లోని భక్తులు ఆర్జిత సేవలకు దూరమవుతున్నారు.

నిత్యం వందల మంది భక్తులు ఏపీ నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి వారి దర్శనానికి వస్తుంటారు. వారంలో రెండు రోజులు శని, ఆదివారాల్లో ఆలయాల్లో స్వామివారి దర్శనం కోసం పోటెత్తుతారు. అలాంటి ఆలయాల్లో స్వామివారి ఆర్జిత సేవలు అందరికీ అందుబాటులో లేకుండా పోయాయి. అధికారులు ఇష్టానుసారంగా పెంచిన ధరల వివరాలను నేటి వరకు ఆలయం బయట ఏర్పాటు చేయలేదు. పాత ధరల బోర్డులే నేటికీ దర్శనమిస్తున్నాయి. కౌంటర్ల వద్ద తెల్ల కాగితాలపై వివరాలను ప్రదర్శించారే కానీ గోపురం బయట వాటి జాడలేదు.

పాత బోర్డులే

పాత బోర్డులే కనిపించడం వల్ల చూసిన భక్తులు ఇవే ధరలు అందుబాటులో ఉన్నాయని భావిస్తున్నారు. తీరా పూజకు వెళ్లిన తరువాత స్వామివారి సేవల ధరలు చూసి సామాన్య భక్తులు నిరాశకు గురవుతున్నారు. కొంత మంది భక్తులకు మాత్రమే అందుబాటులో ధరలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. రెండు రకాల పూజలకు సంబంధించిన రేట్లు మినహా మిగిలిన సేవలకు సంబంధించిన ధరల పట్టికను భక్తులకు అందుబాటులో లేవు. అష్టోత్తర, స్పెషల్‌ దర్శనం, ఎగువ అష్టోత్తరం, ఎగువ కుంకమార్చన రేట్లు సైతం భారంగా మారాయి. రెండు రకాల పూజలకు సగానికి సగంపైగా ధరలు పెంచడం విమర్శలకు దారి తీస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని