logo

ప్రజలకు చేరువలో కార్పొరేట్‌ తరహా వైద్యసేవలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, కార్పోరేట్‌ తరహా వైద్యసేవలను ప్రజలకు చేరువగా తీసుకొస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖా మంత్రి విడదల రజని పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 04:47 IST

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, కార్పోరేట్‌ తరహా వైద్యసేవలను ప్రజలకు చేరువగా తీసుకొస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖా మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఆమె గురువారం తెనాలి సుల్తానాబాదులో నిర్వహించిన వైఎస్సార్‌ నూతన పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలోనే పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై ఆమె పలు విమర్శలు చేశారు. నారా లోకేష్‌ పాదయాత్ర వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఎమ్మెల్యే శివకుమార్‌ మంత్రితో కలసి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. డీపీఎంఓ రత్నమన్మోహన్‌, డిప్యుటీ డీఎంహెచ్‌వో ఈ అన్నపూర్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.జస్వంతరావు, తెనాలి ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ గుంటూరు కోటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని