పంచాయతీల నిధులు తిరిగివ్వాలి
గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులు తిరిగి పంచాయతీలకు విడుదల చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు...
తెదేపా సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీల నిరసన పాదయాత్ర
డీఆర్‌వో చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందిస్తున్న సర్పంచులు, జాస్తి వీరాంజనేయులు తదితరులు
వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులు తిరిగి పంచాయతీలకు విడుదల చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు వట్టిచెరుకూరు మండల కేంద్రం, చమళ్లమూడి, కాట్రపాడు, వింజనంపాడులలో గురువారం నిరసన పాదయాత్రలు నిర్వహించారు. సర్పంచుల గౌరవ వేతనం రూ.3వేల నుంచి రూ.15వేలకు పెంచాలని, ఉపాధి హామీ పథకం పనులు, నిధులు గ్రామ పంచాయతీల ఆధీనంలోకి తేవాలని, గ్రామ పంచాయతీలకు 1984 నుంచి ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్ పథకం కొనసాగించాలని, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లను సర్పంచుల ఆధీనంలో పని చేసేలా ఉంచాలని పాదయాత్రలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వట్టిచెరుకూరు, చమళ్లమూడి, వింజనంపాడు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. పాదయాత్రగా వస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆయా గ్రామాల్లో తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికి మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. సర్పంచులు నార్నె రాజ్యలక్ష్మి, జటావత్ దేవి, పాతూరి శివపార్వతి, ఆరమళ్ల విజయ్‌కుమార్, మేదరమెట్ల శంకర్, పెద్దిలక్ష్మి, రాధాకుమారి, పి.శ్రీనివాసరావు, ఉపసర్పంచులు నార్నె సాంబశివరావు, యడ్లపల్లి సత్యనారాయణ, వల్లభాపురపు సత్యనారాయణ, ఎంపీటీసీలు భీమినేని కోటేశ్వరరావు, కోసూరి నాగరాజకుమారి, ఉప్పుటూరి సుజాత, పంచాయతీ వార్డు సభ్యులు యడ్లపల్లి వాణి, గుండవరపు లక్ష్మణ్, పరిటాల హరిబాబు, తెదేపా గ్రామ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, పాతూరి కృష్ణారావు, సీనియర్ నాయకులు అరికపూడి పాపారావు, ఉప్పుటూరి సాంబశివరావు పాల్గొన్నారు.
అఖిలభారత పంచాయతీ పరిషత్ సంఘీభావం: నిరసన పాదయాత్ర నిర్వహించిన కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల సర్పంచులకు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి డాక్టర్ జాస్తి వీరాంజనేయులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన సర్పంచుల హక్కుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. నిధులు లేకపోతే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ