పల్నాట తుపాకుల సంస్కృతి తెచ్చారు
పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు తుపాకుల సంస్కృతిని ప్రవేశపెట్టారని తెదేపా నేతలు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
బాలకోటిరెడ్డిని పరామర్శించిన తెదేపా నాయకులు
ఆసుపత్రిలో పార్టీ నేతలు ప్రత్తిపాటి, సోమిరెడ్డి, రామానాయుడు, మన్నవ మోహన్‌కృష్ణ తదితరులు
నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే : పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు తుపాకుల సంస్కృతిని ప్రవేశపెట్టారని తెదేపా నేతలు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో అలవాల ఘటనలో కాల్పులకు గురై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న తెదేపా రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిని గురువారం వారు ఆసుపత్రిలో పరామర్శించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ మాజీ విప్ కోన రవికుమార్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్‌కృష్ణ, మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడి, డాక్టర్ చదలవాడ అరవిందబాబు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో నేతలు మాట్లాడుతూ బాలకోటిరెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ రక్తదాహం తీరలేదని, నరసరావుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా తుపాకులను తెచ్చి హత్యాయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతోనే బాలకోటిరెడ్డిపై హత్యాప్రయత్నం చేశారన్నారు. కాల్పుల ఘటనకు గంట ముందుగానే తాము తెదేపా వర్గీయులం అని సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు ప్రచారం చేశారన్నారు. ఇప్పటికీ బాలకోటిరెడ్డిపై ఐదుసార్లు దాడులు జరిగాయన్నారు. వైకాపా వర్గీయులే దాడి చేసి తెదేపా వర్గీయులంటూ దొంగ నాటకాలకు తెర తీశారన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణలో ఎస్పీ రవిశంకరరెడ్డి వైఫల్యం చెందారని, ఆయన ఐపీఎస్ అధికారిలా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. తెదేపా గెలిచిన వెంటనే పోలీసులకు వీరసింహారెడ్డి సినిమా చూపుతామన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తే కచ్చితంగా ప్రతిదాడులకు దిగుతామని హెచ్చరించారు.
నాకు, మా పార్టీకి సంబంధం లేదు : ఎమ్మెల్యే
రొంపిచర్ల : అలవాలలో తెదేపా నేత బాలకోటిరెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబందించి తనకు గాని, తమ పార్టీకి సంబంధం లేదని వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెదేపా నేత ఆధిపత్యపోరుతో భాగంగా సంఘటన జరిగిందన్నారు. గతంలో దాడి జరిగిన సందర్భంలో చర్చించి రాజీ చేసి ఉంటే దాడి జరిగేది కాదని ఆయన చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ