logo

సజావుగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్‌) ప్రశాంతంగా ముగిసింది.

Published : 06 Feb 2023 05:33 IST

94.40 శాతం విద్యార్థుల హాజరు  
కేంద్రాలను తనిఖీచేసిన డీఈవో రామారావు

బాపట్ల పరీక్ష కేంద్రం వద్ద వివరాలు చూసుకుంటున్న విద్యార్థులు

బాపట్ల, చీరాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్‌) ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని పది కేంద్రాల్లో మొత్తం 2429 మంది విద్యార్థులకు 2293 మంది రాసినట్లు డీఈవో పీవీజే రామారావు తెలిపారు. 136 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. 94.40 శాతం విద్యార్థులు హాజరైనట్లు వివరించారు. చీరాల డివిజన్‌ పరిధిలో ఎన్‌ఆర్‌పీఎం, ఏఆర్‌ఎం, కొత్తపేట మదర్‌థెరిసా, కొత్తపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 934 మంది విద్యార్థులకు 890 మంది హాజరవ్వగా...44 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి జి.వెంకటేశ్వర్లు పరిశీలించారు. చీరాల ఎంఈవో డి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. కేంద్రాల వద్ద చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. బాపట్లలో ఉదయం తొమ్మిది గంటలకే పురపాలక ఉన్నత పాఠశాల, సరస్వతీ స్మారక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. పది గంటల తర్వాత ఎవరినీ అనుమతించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని