CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్‌

పాఠశాల విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రాగి జావ అందిస్తోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

Updated : 21 Mar 2023 15:21 IST

అమరావతి: పాఠశాల విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రాగి జావ అందిస్తోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పథకంలో భాగంగా రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిల్లలకు సదుపాయాలు కల్పించడం సహా మేథో వికాసం పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాగిజావ సరఫరా ద్వారా వారికి పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. వారంలో మూడు రోజుల పాటు దీన్ని అందిస్తామన్నారు. ‘గోరుముద్ద’ పథకాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాగిజావ పంపిణీ కోసం ఏటా రూ.86 కోట్లు ఖర్చు అవుతుందని.. వీటిలో సత్యసాయి ట్రస్ట్‌ రూ.42కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.44 కోట్లు భరిస్తున్నాయని జగన్‌ వివరించారు. పథకంలో భాగస్వాములవుతున్నందుకు సత్యసాయి ట్రస్ట్‌ను సీఎం అభినందించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులతో జగన్‌ మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని