logo

నాలుగు రోజులుగా అంధకారం

అకాల వర్షం, గాలుల బీభత్సంతో పల్నాడు జిల్లా నకరికల్లులో నాలుగు రోజులుగా అంధకారం అలుముకుంది. బలమైన గాలులకు విద్యుత్తు స్తంభాలు నేలవాలాయి.

Published : 22 Mar 2023 05:26 IST

నకరికల్లులో ప్రజలకు తాగునీటి కష్టాలు

నకరికల్లులో ట్యాంకరు వద్ద నీటి కోసం పాట్లు

నకరికల్లు, న్యూస్‌టుడే: అకాల వర్షం, గాలుల బీభత్సంతో పల్నాడు జిల్లా నకరికల్లులో నాలుగు రోజులుగా అంధకారం అలుముకుంది. బలమైన గాలులకు విద్యుత్తు స్తంభాలు నేలవాలాయి. తీగలు తెగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. గుక్కెడు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నకరికల్లు సమగ్ర రక్షిత మంచినీటి పథకం నుంచి మూడు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. చీకట్లు తొలగకపోవడంతో అన్నివర్గాలు ఇబ్బంది పడుతున్నారు. దోమల బెడదతో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నారు. చంటిబిడ్డలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల వెతలు వర్ణణాతీతం. వ్యాపారులు స్తంభించాయి. ఛార్జింగ్‌లేక చరవాణులు మూగబోయాయి. విద్యుత్తు కష్టాలతో నకరికల్లుకు చెందిన కొందరు ఇతర ప్రాంతాలకు కుటుంబాలతోసహా తరలివెళ్లారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సొంత ఖర్చులతో మూడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటికోసం మహిళలు పోటీపడుతున్నారు. మంగళవారం ఉదయం కొన్ని ప్రాంతాలకు సరఫరా పునరుద్ధరించారు. సాంకేతిక కారణాలతో మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్లీ నిలిచిపోయింది. ఉపకేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తిందని బుధవారం నాటికి అన్ని ప్రాంతాలకు విద్యుత్తు పునరుద్ధరిస్తామని ఆ శాఖ నరసరావుపేట గ్రామీణ డీఈఈ వెంకటేశ్వరరెడ్డి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు