logo

ఇద్దరి మధ్య వివాదం... ప్రజలకు శాపం

రహదారి గుంతల మరమ్మతులు విషయంలో ఇద్దరు గుత్తేదారుల మధ్య వివాదం ప్రజలకు శాపంగా మారింది. స్థానికులు..గుత్తేదారు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 31 May 2023 05:48 IST

మరమ్మతులు చేశాక పాడైపోయిన సీతానగర్‌ ఒకటో వీధి రోడ్డు

నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే : రహదారి గుంతల మరమ్మతులు విషయంలో ఇద్దరు గుత్తేదారుల మధ్య వివాదం ప్రజలకు శాపంగా మారింది. స్థానికులు..గుత్తేదారు తెలిపిన వివరాల ప్రకారం..సీతానగర్‌ 1వ వీధిలో రహదారిపై గుంతలు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. గుత్తేదారు రాకేష్‌ మరమమ్మతులు పూర్తి చేశారు. ఇంతలో అటుగా రైల్వే గూడ్స్‌ షెడ్డు నుంచి సరకులు తరలించే ఓ గుత్తేదారు తమ లారీలు వెంటనే వెళ్లకపోతే నష్టం వస్తుందని...పట్టుబట్టి నడిపారు. దీంతో ఇరువర్గాల మధ్య కొంత వివాదం జరిగింది. కొద్దిగంటలు ఆగితే కొత్తగా పోసిన రోడ్డు ఆరిపోయి బాగుంటుందని చెప్పినా వినకుండా లారీలు నడపడంతో అది పాడైపోయిందని రాకేష్‌ ఆరోపించారు. ఇలా మరమ్మతులు చేసిన ప్రాంతం మళ్లీ పాడైపోవడంతో అలాగే వదిలేశారు. ఇటుగా నెహ్రూనగర్‌, సీతానగర్‌, ఆర్టీసీ కాలనీ, మంగళదాస్‌నగర్‌, అరుంధతినగర్‌ తదితర ప్రాంతాల వాసులు రాకపోకలు చేస్తారు. ప్రస్తుతం వారంతా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై గుత్తేదారు రాజేష్‌ మాట్లాడుతూ రాత్రి 9 నుంచి ఉదయం 9 గంటల వరకు మరమ్మతులకు ముందస్తుగా అధికారుల వద్ద అనుమతి తీసుకొని ఈనెల 20న రోడ్డు పనులు చేయించానని చెప్పారు. సుమారు రూ.లక్ష ఖర్చయ్యింది...కొద్ది గంటలు లారీలను వేరే మార్గంలో నడపాలని కోరినా...పోలీసులు పెట్టిన బారికేడ్లు తొలగించి పోనివ్వడంతో రహదారి పాడైపోయిందని తెలిపారు. ఆ గుంతను లారీల గుత్తేదారు బాగు చేయించాలని లేదా నష్టపరిహారం ఇస్తే మళ్లీ మరమ్మతులు చేస్తామని చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై నగరపాలక సంస్థ డీఈ కల్యాణ్‌రావును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ఈ రోడ్డును పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

ఆ రహదారి బాగోకపోవడంతో  సీతానగర్‌, నెహ్రూనగర్‌ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని