logo

సమస్యల పరిష్కారానికి పోరాడతాం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాడతామని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ పీటీడీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌ తెలిపారు.

Published : 31 May 2023 05:48 IST

8న గుంటూరులో ప్రాంతీయ సదస్సు

సామూహిక దీక్షలో మాట్లాడుతున్న ఏపీ పీటీడీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాడతామని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ పీటీడీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌ తెలిపారు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షను దామోదర్‌ ప్రారంభించి ప్రసంగించారు. ఏపీ జేఏసీ అమరావతి 83 రోజులుగా ఉద్యమం చేస్తుందన్నారు. ప్రతి ఉద్యోగి బాధ్యతను భుజాలపైకి తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. ఈ ఉద్యమానికి ఉద్యోగులంతా వెన్నుదన్నుగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతామన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చేస్తున్న ఉద్యమంలో పాల్గొనకుండా ఉండేలా ఇతర ఉద్యోగ సంఘ నాయకులను ఆపగలరేమో కానీ కడుపు మండిన సగటు ఉద్యోగిని ఎవరూ ఆపలేరన్నారు. జూన్‌ 8న ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నాలుగో ప్రాంతీయ సదస్సును గుంటూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీక్షలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ఛైర్మన్‌ కనపర్తి సంగీతరావు, ప్రధాన కార్యదర్శి పి.ఎ.కిరణ్‌కుమార్‌, కోఛైర్మన్‌, అటవీ శాఖ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.విజయ్‌కుమార్‌, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కృష్ణారావు, వీఆర్‌వో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని