logo

Palnadu: జగనన్నా.. ఇంట్లో ఉండే దారేదన్నా..

గురజాల నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని జగనన్న కాలనీలో రెండేళ్ల క్రితం 1371 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇక్కడ ఇంటిని నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో గుత్తేదారుకు అప్పగించారు.

Updated : 25 Jan 2024 07:58 IST

గురజాల సమీపంలో గుత్తేదారు నిర్మించిన ఇళ్లు

గురజాల నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని జగనన్న కాలనీలో రెండేళ్ల క్రితం 1371 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇక్కడ ఇంటిని నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో గుత్తేదారుకు అప్పగించారు. వందల సంఖ్యలో ఇళ్లు పూర్తయినా, నివాసయోగ్యంగా లేకుండాపోయాయి. ఇంటి పని పూర్తిగా చేయకపోవడం, కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఇక్కడ ఉండేందుకు లబ్ధిదారులు ఆసక్తిచూపడం లేదు. ఇప్పటి వరకు 316 ఇళ్లు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా, 5 కుటుంబాలకు చెందినవారు మాత్రమే నివాసం ఉంటున్నారు. ఇంటికి ప్లాస్టింగ్‌ వంటి పనులు పూర్తిచేయకపోవడం, ఇతర పనులు పూర్తిచేసి ఇళ్లల్లో చేరేందుకు కనీసం రూ.2 లక్షల మేర ఖర్చవుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. తాగునీరు రహదారులు, మురుగు కాలువల వంటి కనీస వసతులు లేవు. జగనన్న కాలనీ అంతా పిచ్చిమొక్కలతో నిండి నిర్మించిన ఇళ్లు పగుళ్లుబారుతున్నాయి. మౌలిక వసతుల కల్పన మాత్రం ప్రభుత్వానికి పట్టడం లేదని జనం వాపోతున్నారు.

ఈనాడు, నరసరావుపేట - న్యూస్‌టుడే, గురజాల గ్రామీణ 

అధ్వానంగా కాలనీ రహదారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు