logo

Guntur: మా అబ్బాయిని ఏం చేశారు?: డీఎస్పీకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

‘మా అబ్బాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నాం. చేతికి చిన్న పుండుందని ఆసుపత్రికి తీసుకువెళితే తన కుమారుడు కనిపించకుండాపోయాడు. ఆసుపత్రి వాళ్లే దాచిపెట్టి ఉంటారని ఆరోపిస్తూ బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం గంగవరానికి చెందిన సుబ్బరావమ్మ,

Updated : 30 Jan 2024 06:59 IST

ఆసుపత్రివాళ్లే దాచి పెట్టారని ఆరోపణ

కుమారుడి ఫొటోతో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సుబ్బరావమ్మ, జయరామిరెడ్డి

నెహ్రూనగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ‘మా అబ్బాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నాం. చేతికి చిన్న పుండుందని ఆసుపత్రికి తీసుకువెళితే తన కుమారుడు కనిపించకుండాపోయాడు. ఆసుపత్రి వాళ్లే దాచిపెట్టి ఉంటారని ఆరోపిస్తూ బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం గంగవరానికి చెందిన సుబ్బరావమ్మ, జయరామిరెడ్డి సోమవారం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన డీఎస్పీ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. అనంతరం బాధిత తల్లిదండ్రులు విలేకర్లతో మాట్లాడారు. ‘మేము వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాం. మా అబ్బాయి విజయభాస్కర్‌రెడ్డి(30) మాకు అండగా ఉంటున్నాడు. అతని చేతికి ఉంగరాలు పెట్టుకునేచోట పుండు పడడంతో ఈ నెల 23న గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపిస్తే చిన్న ఆపరేషన్‌ చేశారు. మా అబ్బాయిని తీసుకొని అక్కడున్న మందుల దుకాణం వద్దకు వచ్చా. మందు బిళ్లలు తీసుకొని మింగిస్తుంటే అక్కడ సిబ్బంది ఏదైనా అల్పాహారం తినిపించి బిళ్లలు వేయాలన్నారు. మా అబ్బాయిని వాళ్లకు అప్పజెప్పి దగ్గరలో ఉన్న హోటల్‌కు వెళ్లి అల్పాహారం తీసుకొని రాగా.. అబ్బాయి అక్కడ లేడు. అదేమని వాళ్లను అడిగితే తమకు తెలియదన్నారు. సీసీ కెమెరాలు పరిశీలించమంటే మరుసటి రోజు రమ్మన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి కెమెరాలు పరిశీలించటానికి వారితో కలిసి వెళ్లాను. ఆ సమయంలో అక్కడ సీసీ ఫుటేజీలు తీసివేసి ఉన్నాయి. అదేమని అడిగితే స్టోరేజ్‌ అవ్వడం లేదన్నారు. అల్పాహారం తీసుకువచ్చే 20 నిమిషాల్లోనే ఎలా అదృశ్యమయ్యాడో తెలియడంలేదు. అవయవాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రివాళ్లే దాచి పెట్టి ఉంటారని అనుమానం కలుగుతోంది. మా అబ్బాయి కోసం ఫొటో పట్టుకొని రోజుల తరబడి అన్నిచోట్ల తిరుగుతున్నాం. విచారించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం’ అతడి తల్లిదండ్రులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని