logo

మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు

ఈనెల 16న ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు

Published : 28 Mar 2024 06:15 IST

పొన్నూరు, న్యూస్‌టుడే: ఈనెల 16న ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వారు విచారణ నిర్వహించమని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ సమయంలో చేబ్రోలు, పెదకాకాని మండల అధికారులపై వైకాపా నేతలు ఒత్తిడి తెచ్చారు. దీంతో విచారణ నామమాత్రంగా నిర్వహించారు. వైకాపా అభ్యర్థి నిర్వహించిన సమావేశంలో చేబ్రోలు నుంచి 37 మంది, పెదకాకాని నుంచి 8 మంది పాల్గొన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. దీనిపై ఉన్నతాధికారులు ఆ 45 మంది వాలంటీర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే చేబ్రోలు, పెదకాకాని మండల అధికారులు వాలంటీర్లపై చేసిన విచారణ సక్రమంగా జరగలేదని ఈనెల 22న ‘మనోళ్లంటే వదిలేసి..ఆళ్లోళ్లంటే తీసేసి’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారులు స్పందించారు. మళ్లీ లోతుగా విచారణ చేశారు. చేబ్రోలు మండలం నుంచి మరో 42 మంది, పెదకాకాని మండలం నుంచి 10 మంది వాలంటీర్లు సమావేశంలో పాల్గొన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈమేరకు రెండు మండలాలకు చెందిన 52 మంది వాలంటీర్లను తొలగిస్తూ బుధవారం రాత్రి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని