logo

కలగా మినీ రైతుబజార్లు

నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో రైతుబజార్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్‌లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు.

Published : 20 Apr 2024 05:01 IST

పొన్నూరు, న్యూస్‌టుడే: నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో రైతుబజార్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్‌లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 35 టన్నుల నుంచి 40 టన్నుల వరకు కూరగాయలను విక్రయాలు జరిపారు. ప్రతి రోజు రైతు బజార్‌కు 1,300 నుంచి 1,500 మంది వరకు వినియోగదారులు వచ్చి కురగాయలు కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

 ప్రతిపాదనలకు... మూడేళ్లు

మూడేళ్ల క్రితం మినీ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రైతు బజార్‌ ఎస్టేట్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్పుడే ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కసుకర్రు రోడ్డు, నిడుబ్రోలు పార్కు వద్ద మినీ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారుల పరిశీలనకు పంపించారు. నేటికి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం చేశారు.

ఎమ్మెల్యే హామీ గాలికి

ఎమ్మెల్యే హామీ గాలికిపొన్నూరులోని వివిధ ప్రాంతాల్లో మినీ రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. కొంత మంది వ్యాపారులు పాత కాలం నాటి తూకాలు వాడటం వల్ల తూకంలో కూడా మోసగిస్తున్నారని వారు చెబుతున్నారు.

ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలం

ప్రజల అవసరాలు తీర్చే ప్రక్రియలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. నిడుబ్రోలులో రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని గతంలో వైకాపా నేతలు చెప్పారు. రైతుబజార్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇంటి వద్దకు వచ్చిన వ్యాపారులు వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం. నాణ్యత లేని కూరగాయలను వ్యాపారులు విక్రయిస్తున్న తప్పడం లేదు.   

- ఎ.మంగమ్మ, నిడుబ్రోలు


తూకంలో మోసపోతున్నాం

నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌ రహదారిలో ఏర్పాటు చేసిన రైతుబజార్లు చాలా దూరంలో ఉంది. ఆ రైతు బజార్లుకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాలనీకి వచ్చిన వ్యాపారులు వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం. అనుమానం వచ్చి వేరే దుకాణంలో తూకం వేయించగా కేజీకి 100 గ్రాములు తగ్గాయి.
- ఎ.నాగేశ్వరి, భావనగర్‌కాలనీ


ఖర్చులు పెరిగిపోయాయి

ఆదాయం తగ్గిపోయింది. సంపాదనలో కొంత భాగం కూరగాయల కొనుగోలుకు సరి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు తగ్గిన ఇంటి వద్దకు వచ్చే వ్యాపారులు ధరలు తగ్గించడం లేదు. వైకాపా పాలనలో ధరల బాగా పెరగడంతో పేద ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడింది.
- బి.రాజేశ్వరి, పాత పొన్నూరు


పట్టణం: పొన్నూరు
వార్డుల సంఖ్య : 31
జనాభా : 61,500
కుటుంబాలు : 17,500

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని