logo

వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు

జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు.

Published : 23 Apr 2024 06:03 IST

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. 82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 17 మంది విద్యార్థులు పరీక్షల్లో తప్పారు. మంగళగిరి బాలికల వసతి గృహం విద్యార్థిని కట్టెపోగు స్వాతి 561 మార్కులు, పొన్నూరు హాస్టల్‌ విద్యార్థిని యడ్ల రజిత 507 మార్కులు సాధించారు. 2022-23 విద్యా ఏడాదిలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు 48 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 2023-24లో 82 శాతం ఉత్తీర్ణత సాధించారు.

బీసీ వసతి గృహాల్లో 93.85 శాతం ఉత్తీర్ణత: జిల్లా బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు 130 మంది పరీక్షలకు హాజరు కాగా 122 మంది ఉత్తీర్ణులయ్యారు. 8 మంది పరీక్షల్లో తప్పారు. 93.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పది మంది 500 మార్కులు పైన సాధించారు. గత ఏడాదిలో 82.46 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ సంవత్సరం అధిగమించి 93.85 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం.

ఎస్టీ హాస్టల్‌ విద్యార్థులు 70.83 శాతం.. జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలకు చెందిన విద్యార్థులు 72 మంది పరీక్షలకు హాజరు కాగా.. 51 మంది ఉత్తీర్ణులయ్యారు. 70.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. 21 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. గత ఏడాదిలో 42 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది మెరుగుపడింది.

అంబేడ్కర్‌ గురుకులాల్లో 92.18 శాతం.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అంబేడ్కర్‌ గురుకులాల్లో 1509 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1391 మంది ఉత్తీర్ణులయ్యారు. 118 మంది పరీక్షల్లో తప్పారు. 92.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాకుమాను, నాగులపాలెం, యద్ధనపూడి బాలికల గురుకులాల విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణులయ్యారు. చుండూరు బాలుర గురుకులం విద్యార్థులు 20 మంది, రేపల్లె బాలికల గురుకులం విద్యార్థులు 13 మంది అనుత్తీర్ణులయ్యారు. 2022-23 వార్షిక పరీక్షల్లో జిల్లాలోని గురుకులాల్లో 71.34 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి 92.18 శాతం నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని