logo

సప్లిమెంటరీ ఫీజుల చెల్లింపునకు మే 4 వరకు గడువు

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లించేందుకు గడువు మే 4 వరకు ఉందని డీఈవో ఎం.వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 01 May 2024 05:30 IST

నరసరావుపేట అర్బన్‌ న్యూస్‌టుడే : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లించేందుకు గడువు మే 4 వరకు ఉందని డీఈవో ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. పరీక్షలు జూన్‌ 1 నుంచి 8 వరకు ఉంటాయన్నారు. సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుంతో 6 వరకు, రూ.50తో 8 వరకు చెల్లించవచ్చని చెప్పారు. పదో తరగతి పరీక్షలకు 959 మంది, ఇంటర్మీడియట్‌కు 1420 మంది చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని