ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే ఘాతుకం
నిందితుల అరెస్టు
నెహ్రూనగర్(గుంటూరు), న్యూస్‌టుడే : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను సోమవారం ప్రత్యేక విచారణాధికారి, డీఎస్పీ వీవీ నాయుడు, కొత్తపేట సీఐ అన్వర్ బాషా తెలిపారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ఆర్ ఉమ్మడివరం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్(35) తన భార్య పిల్లలతో బతుకు దెరువుకు గుంటూరు వచ్చి బుచ్చయ్యతోటలో నివాసం ఉంటున్నాడు. అతను పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య భారతి సమోసాలు తయారు చేసే షాపునకు వెళుతుండేది. షాపు యజమాని గౌస్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న ప్రేమ్‌కుమార్ మందలించాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్పర్థలు వచ్చి గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో ఏప్రిల్ 28వ తేదీ రాత్రి ప్రేమ్‌కుమార్ ఓ పెళ్లికి వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని భార్య భారతి 29వ తేదీన కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని, భర్త కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. సీఐ అన్వర్ బాషా అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విచారించగా భారతి తన భర్తను చంపించినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చడానికి భారతి తన ప్రియుడు గౌస్‌తో కలిసి కుట్ర పన్నింది. ప్రియురాలి కోరిక మేరకు గౌస్ తన తమ్ముడు షేక్ ఖాసిం, అతని స్నేహితుడు పఠాన్ రెహమాన్‌తో కలిసి పథకం రచించాడు. ప్రేమ్‌కుమార్‌కు మాయమాటలు చెప్పి కొర్నెపాడులోని జగనన్నకాలనీ లేఔట్ దగ్గరకు తీసుకువెళ్లారు. బాగా మద్యం తాగించి కర్రతో కొట్టి, తర్వాత కత్తులతో పీకకోసి కిరాతకంగా హత మార్చి అక్కడే పడేసి వెళ్లారు. ఇంటికి వచ్చి భారతితో తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నిందితులు భారతి, గౌస్, ఖాసిం, పఠాన్ రెహమాన్లను సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య కేసు ఛేదించి నిందితులను అరెస్టు చేసిన సీఐ అన్వర్‌బాషా, ఎస్సై హనుమంతురావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్‌కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్‌గా ఉన్న శివశంకర్‌ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్‌బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రిస్‌గేల్: జెర్సీ ఇంకా ఫిట్‌గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!