logo

ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు

Published : 18 May 2024 05:16 IST

పోలీసులను ఆశ్రయించిన బాపట్ల స్వతంత్ర అభ్యర్థిని

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలేనికి చెందిన దోనెపాటి షాలిని బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నెల 13న పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఓటింగ్‌ సరళిని పరిశీలించేందుకు ఆమె గ్రామంలో 193వ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా బాపట్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కోన రఘుపతి అనుచరులు కుంఠం ప్రసన్నరాజు, బొలిమేర అమరబాబు, పేరలి రుషివర్మ, తుమ్మాటి నాగరాజు, జంగం మహేష్‌, బెజ్జం సుధీర్‌, బేబ్రోలు రవితేజతో పాటు మరికొందరు వ్యక్తులు తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ‘ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నీకు ఏ అర్హత ఉంది, ఎన్నికల తర్వాత నిన్ను హత్య చేసి మురుగు కాలువలో పడేస్తామని’ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని వారి నుంచి రక్షణ కల్పించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఎస్సై అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా ఫిర్యా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని