logo
Updated : 18 Sep 2021 07:46 IST

Prison: చిన్నపిల్లల నీలి చిత్రాలు చూస్తే..? నేరుగా జైలుకే!

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నపిల్లలతో అసహజంగా చిత్రీకరించిన నీలిచిత్రాలు చూస్తున్న వారు నేరుగా జైలుకే వెళ్తున్నారు. ఎక్కడున్నా సరే వారిని పోలీసులు వెంటాడి, వేటాడి మరీ పట్టుకుని కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. నాలుగైదేళ్లుగా మైనర్లతో చిత్రీకరించిన నీలిచిత్రాల వెబ్‌సైట్లను వీక్షించే వారి సంఖ్య పెరుగుతుండడం, వీటి ప్రభావంతో చిన్నారులు, మైనర్లపై అకృత్యాలు పెరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా నీలిచిత్రాలు చూస్తున్న వారిని గుర్తించి వారి చరవాణులు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ఐపీ చిరునామాల ఆధారంగా నిందితులను గుర్తించి నివేదికకు ఆయా రాష్ట్రాలకు పంపుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 1,095 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ తరహా నీలిచిత్రాల వెబ్‌సైట్లను చూస్తున్న వారిని జాతీయ నేర గణాంకాల బ్యూరో గుర్తిస్తుంది. మారుమూల ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు నీలి చిత్రాల వెబ్‌సైట్లు చూస్తున్న వారిని గుర్తించేందుకు ఈ బ్యూరో సీ సామ్‌ అనే అమెరికన్‌ సంస్థతో నాలుగేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఇస్తున్న వివరాలతోపాటు అదనంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి నిందితులను జైలుకు పంపుతున్నాయి. కేరళలో పీ-హంట్‌ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా.. జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌తో మహారాష్ట్ర పోలీసులు సంప్రదించి సైబర్‌ సెల్‌ ద్వారా నిందితుల వివరాలను సేకరిస్తున్నారు.


తొలుత ఐదేళ్లు.. రెండోసారి దొరికితే ఏడేళ్లు..

* చిన్నారులపై చిత్రీకరించిన నీలిచిత్రాలు వీక్షణాన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. తొలిసారి దొరికిన వారికి ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల వరకూ జరిమానా విధిస్తున్నాయి.

* రెండోసారి కూడా నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేస్తే... ఏడేళ్లపాటు జైలులోనే ఉండాలి. దీంతోపాటు రూ.10లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

* హైదరాబాద్‌లో రెండేళ్ల క్రితం 16 కేసులు నమోదు కాగా, ఇందులో ముగ్గురిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతేడాది కూడా 20 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు నిందితులపై రెండోసారి కేసు నమోదయ్యాయి.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని