logo
Updated : 27 Oct 2021 13:11 IST

TS News: సంసారంలో చిచ్చుపెట్టిన చిన్ననాటి పరిచయం

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య


పోలీసుల అదుపులో నిందితులు

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: లారీ డ్రైవర్‌ను గొంతు కోసి హత్య చేసిన కేసును హయత్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి భార్యే హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఎల్బీనగర్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన మహమ్మద్‌ ముస్కాన్‌ పటేల్‌(45), భార్య ఫిర్దోద్‌ బేగం(35) నలుగురు పిల్లలతో కలిసి సైదాబాద్‌లోని సపోటాబాగ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ముస్తాక్‌ పటేల్‌ లారీ డ్రైవర్‌. ఫిర్దోద్‌ బేగానికి వరుసకు మరిది, చిన్ననాటి స్నేహితుడైన కర్ణాటక కలబురిగికి చెందిన మహమ్మద్‌ హమీద్‌ పటేల్‌(37) సపోటాబాగ్‌లో భార్యాపిల్లలతో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒకే దగ్గర ఉండడంతో ఇద్దరి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. విషయం ముస్తాక్‌ పటేల్‌కు తెలియడంతో రెండేళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. దీంతో అతడ్ని హత్య చేయడానికి ఇద్దరూ పథకం రచించారు. ఈనెల 22న హామీద్‌ స్నేహితుడైన సైదాబాద్‌ జహంగీర్‌నగర్‌లో నివాసముంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన సయ్యద్‌ నాయాబ్‌(23) సాయం తీసుకున్నారు. ముగ్గురు కలిసి ముస్కాన్‌ను కారులో ఎక్కించుకుని రోజంతా మద్యం తాగిస్తూ తిప్పారు. బాటసింగారం గ్రామానికి వెళ్లే రోడ్డులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కళ్లలో కారం చల్లి కత్తితో గొంతు కోశారు. తర్వాత హయత్‌నగర్‌ హైవే(రేడియో స్టేషన్‌) సమీపంలో మృతదేహంతోపాటు కారును వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌, డీఐ నిరంజన్‌, ఎస్సై శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని