logo
Published : 02/12/2021 03:30 IST

మొదటి డోసు టీకా 82 శాతం పూర్తి: కలెక్టర్‌

సమీక్షలో మాట్లాడుతున్న పాలనాధికారిణి నిఖిల

వికారాబాద్‌ మున్సిపాలిటీ: జిల్లాలో కొవిడ్‌ టీకా మొదటి డోసు 82 శాతం  పూర్తి చేశారని, రెండో డోసు 20 శాతం మేర వేశారని  పాలనాధికారిణి నిఖిల తెలిపారు. బుధవారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా  కొవిడ్‌ టీకాపై సమీక్షించారు. ఈ సందర్భంగా నిఖిల జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ గురించి వివరించారు. మొదటి డోసు తీసుకొని రెండో డోసుకు అర్హులైన వారు 27,646 మంది ఉన్నారు. జిల్లాలోని 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తక్కువగా టీకాలు వేశారన్నారు. ఈనెల 15వ తేదీ లోగా మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. వంద శాతం టీకా పూర్తి చేయాలని ఇందుకు ప్రతి రోజు అధికారులతో సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని మంత్రి హరీశ్‌ రావు సూచించారు. ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు వైద్యాధికారులను సైతం భాగస్వామ్యం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు పాలానాధికారులు మోతీలాల్‌, చంద్రయ్య, మున్సిపల్‌ అధ్యక్షురాలు మంజుల, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తుకారాంభట్‌, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, డీఆర్‌డీఓ కృష్ణన్‌, డీపీఓ మల్లారెడ్డి, జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.
ర్యాంక్‌ అభినందనీయం
స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో వికారాబాద్‌ పురపాలక సంఘం రాష్ట్రంలో 4 ర్యాంక్‌, దక్షిణ భారత దేశంలో 16వ ర్యాంక్‌ను సాధించటం అభినందనీయమని భవిష్యత్తులో మరింతగా మెరుగైన ర్యాంక్‌ రావడానికి కృషి చేయాలని నిఖిల సూచించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌కు మిఠాయిలు ఇవ్వడానికి పురపాలక సంఘం అధ్యక్షురాలు మంజుల వచ్చారు. వాటిని తీసుకుని ఆమెకు తినిపించి అభినందించి మాట్లాడారు. 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని