logo
Published : 02/12/2021 03:30 IST

సాంబారులో మునక్కాడ వాసనేది?

ఈనాడు, హైదరాబాద్‌: ఎంత ఎండ ఉంటే.. అంత పంట పండే మునగ చలికి చిక్కింది. రైతుబజార్లలో.. మార్కెట్లలో కనిపించని పరిస్థితికి చేరింది. అరకొరగా వస్తుండడంతో ధర ఆకాశాన్నంటుతోంది. ఒక్కొక్కటి రూ.15 పలుకుతోంది. గతంలో రైతుబజార్లలో కిలో రూ.30 పలికేది ఇప్పుడు రూ.90-రూ.100 ఉంటోంది. బోయిన్‌పల్లి హోల్‌సేల్‌ మార్కెట్‌కు అస్సలు రావడంలేదు. రైతుబజార్లకు వస్తున్నవి గోధుమ, మట్టి రంగులో ఉండడంతో ఎవరూ కొనడానికి ముందుకు రావడంలేదు.

* తమిళనాడు నుంచి ఎక్కువ: సముద్ర తీర ప్రాంతాల్లో మునగ ఎక్కువగా పండుతుంది. జనవరి-జూన్‌ మధ్య స్థానిక పంట అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మనకు తమిళనాడు నుంచి ఎక్కువగా వస్తుంది. అక్కడ వరదల వల్ల రాక బందయ్యింది. గతంలో నగరానికి రోజు 25 క్వింటాళ్ల వరకు సరకు వచ్చేది. ప్రస్తుతం గుజరాత్‌లోని బరోడా నుంచి తెప్పిస్తున్నారు. అదీ కేవలం రోజుకు 1-2 క్వింటాళ్లే వస్తున్నాయి. 

* ఔషధంగా.. : మునగ ఆకు, కాయలు, పుష్పాలు, బెరడు, వేరుల్లో ఔషధ గుణాలున్నాయి. విటమిన్‌ ఎ, సీలతో పాటు.. పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. జలుబు, ఫ్లూ, ఆస్థమా, ముక్కు కారడం, శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఎముకల పటిష్ఠానికి, రక్త శుద్ధికి దోహదపడుతుంది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని