logo

పంట మార్పిడి మేలు: కలెక్టర్‌

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పాలనాధికారిణి నిఖిల రైతులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వారితో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Published : 08 Dec 2021 00:51 IST


ధాన్యాన్ని పరిశీలిస్తున్న నిఖిల

ధారూర్‌, న్యూస్‌టుడే: వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పాలనాధికారిణి నిఖిల రైతులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వారితో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌సీఐ ద్వారా వడ్లను కొనుగోలు చేయడం లేదన్నారు. ఆరుతడి పంటలు వేరుసెనగ, మినుము, పెసర, జొన్న తదితరాలు సాగు చేస్తే ఆ ఉత్పత్తులను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ఆయకట్టులో వరి తప్ప మిగతా పంటలు పండే పరిస్థితి లేదని కొందరు రైతులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. కోతుల కారణంగా ఇతర పంటలు వేస్తే నష్టపోయో అవకాశం ఉందని వివరించారు. ఈలాంటి పొలాల్లో ఇంటి వినియోగానికి అవసరమైన వరిని మాత్రమే వేసుకోవాలని సూచించారు. కోతుల సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నిరంతరం ఒకే పంట సాగు వల్ల నేల సారాన్ని కోల్పోతుందని, పంట మార్పిడి తప్పని సరిగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి చంద్రయ్య, పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్‌,  జిల్లా మేనేజర్‌, విమల, తహసీల్దారు బీమయ్యగౌడ్‌, ఏఓ జ్యోతి, విస్తరణ అధికారి సంజురాథోడ్‌ పాల్గొన్నారు.

టీకా విషయంలో నిర్లక్ష్యం తగదు  
వికారాబాద్‌ కలెక్టరేట్‌: కరోనా కట్టడికి టీకాను వేయించుకోవాలని కలెక్టర్‌ నిఖిల సూచించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి గూగూల్‌మీట్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. మొదటి, రెండో డోసు టీకాను తీసుకోనివారు తప్పనిసరిగా వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జడ్పీ సీఈఓ, డీపీఓ, డీఆర్‌డీవో, వైద్య అధికారులదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ పై గ్రామాల్లో టాంటాం వేయించాలని సూచించారు. ఈ ప్రక్రియపై ప్రతి రోజు సమీక్షిస్తానని తెలిపారు. నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం హరితహారం కార్యాచరణపై ఆమె సమీక్షించి, ప్రణాళికను శాఖల వారీగా సిద్ధం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు పాలానాధికారులు మోతీలాల్‌, చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి వేణుమాధవరావు, డీఆర్‌డీఓ కృష్ణన్‌, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని