logo

Crime News: జూబ్లీహిల్స్‌లోకన్నకూతురిపై తండ్రి అత్యాచారం

కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ ప్రాంతంలో నివసించే

Published : 15 Jan 2022 09:25 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవరు భార్యకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగా లేదు. దీంతో కొద్దిరోజుల క్రితం ఇంటికొచ్చిన సోదరుడితో కలిసి పిల్లలను తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకొంది. అయితే కుమార్తెను, ఇద్దరు కుమారులను తనవద్దనే ఉంచుకుంటానని భర్త చెప్పడంతో ఆమె సోదరుడితో కలిసి వెళ్లింది. ఈనెల 9న యథావిధిగా ఇంటికొచ్చిన తండ్రి అర్ధరాత్రి దాటిన తరువాత కుమార్తె(15) నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని మరుసటి రోజు తన సోదరుడికి తెలియజేయగా, ఇద్దరూ కలిసి మహబూబ్‌నగర్‌లో ఉన్న తల్లి వద్దకు వెళ్లారు. జరిగిన విషయాన్ని కుమార్తె తల్లితో చెప్పడంతో శుక్రవారం నగరానికి వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రిపై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని