logo

చిత్ర వార్తలు

నోరూరించే రాజస్థానీ సంప్రదాయ వంటకం ఇది. ఘేవర్‌ అని పిలుస్తారు. నెయ్యి, మైదా, చక్కెరతో తయారు చేస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అత్యంత ఇష్టంగా ఆరగిస్తారు. ఈ ప్రాంతాల ప్రజలు అధికంగా ఉన్న

Published : 15 Jan 2022 01:43 IST

వావ్‌.. ఘేవర్‌!

నోరూరించే రాజస్థానీ సంప్రదాయ వంటకం ఇది. ఘేవర్‌ అని పిలుస్తారు. నెయ్యి, మైదా, చక్కెరతో తయారు చేస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అత్యంత ఇష్టంగా ఆరగిస్తారు. ఈ ప్రాంతాల ప్రజలు అధికంగా ఉన్న బేగంబజార్‌లోని ఓ దుకాణంలో ఈ మిఠాయిని తయారు చేస్తున్న దృశ్యం.


మంచు కురిసే.. మనసు మురిసే

తాండూరు పట్టణాన్ని శుక్రవారం తెల్లవారు జామునుంచి పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు  అలుముకోవడంతో వాహనాదారులు దీపాల వెలుగులో ప్రయాణం సాగించారు. కొన్ని ప్రాంతాల్లో భవంతుల మీదకు చేరుకుని ఆస్వాదించారు.

- న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌


ముంచేస్తున్న దుమ్ము..!

తాండూరులో దుమ్ముతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని రోడ్లపై ప్రయాణమంటేనే వాహనాదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీలు, కార్లు ఇతర వాహనాల రాకపోకల సమయంలో విపరీతమైన దుమ్మ, ధూళి రేగి దుకాణాలు, ఇళ్లను మంచేస్తోంది. దాదాపు అన్ని మార్గాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. చాలా మంది శ్వాస కోశŸ సమస్యతో బాధపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకుల పర్యటన సమయంలో మాత్రమే రోడ్లపై నీళ్లు చల్లిస్తున్నారు. అనంతరం ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌  


కనుల పండువగా గోదాదేవి కల్యాణోత్సవం

శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం గోదాదేవి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున వచ్చారు. ధనుర్మాస విశిష్టతను ఆలయ పండితులు ధరూరి శ్రీనివాసాచార్యులు వివరించారు.

- న్యూస్‌టుడే, కొడంగల్‌


శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ముగ్గుల పోటీ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున ఆలయానికి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 48 మంది 24 ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా రంగులతో నవగ్రహాలను తెలుపుతూ వేసిన రంగవల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు అందించారు.

- న్యూస్‌టుడే, కొడంగల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని