logo

గ్రేటర్‌లో 1492 కేసులు

గ్రేటర్‌లో కరోనా విజృంభిస్తోంది. గ్రేటర్‌ మూడు జిల్లాల్లో ఆదివారం 1492కేసులు నమోదైనట్లు వైద్యశాఖ తెలిపింది. జీహచ్‌ఎంసీ పరిధిలో 1174, రంగారెడ్డిలో 140, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 178 కేసులు నమోదయ్యాయి. వైద్యులు, సహాయక సిబ్బంది, పోలీసులు పెద్ద

Published : 17 Jan 2022 05:33 IST

గాంధీలో 35 మంది గర్భిణులకు చికిత్స

ఈనాడు, హైదరాబాద్‌, గాంధీఆసుపత్రి, రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: గ్రేటర్‌లో కరోనా విజృంభిస్తోంది. గ్రేటర్‌ మూడు జిల్లాల్లో ఆదివారం 1492కేసులు నమోదైనట్లు వైద్యశాఖ తెలిపింది. జీహచ్‌ఎంసీ పరిధిలో 1174, రంగారెడ్డిలో 140, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 178 కేసులు నమోదయ్యాయి. వైద్యులు, సహాయక సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున మహమ్మారి బారినపడటం ఆందోళనకు గురిచేస్తుంది. నగరంలోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో ఒక్కరోజే సుమారు 20 మంది సిబ్బందికి నిర్ధారణ అయ్యింది. గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలో తాజాగా 100 మంది వరకూ కొవిడ్‌ లక్షణాలతో హోం ఐసొలేషన్‌కు చేరినట్లు సమాచారం. నెలరోజులుగా పండుగలు, వేడుకలు, ప్రముఖుల పర్యటనల్లో బందోబస్తు విధులు నిర్వర్తించిన సిబ్బందిలో ఒమిక్రాన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాజేంద్రనగర్‌ ఠాణాలో పనిచేస్తున్న 16మంది పోలీసులకు కొవిడ్‌ ఉన్నట్లు తేలింది. ఇందులో ఇద్దరు ఎస్సైలతోపాటు, ఒక ఏఎస్సై, 13 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వైరస్‌ బారినపడి గాంధీ ఆసుపత్రిలో చేరిన గర్భిణుల సంఖ్య ఆదివారం 35కు చేరింది. నలుగురు చిన్నారులతో కలిపి అక్కడ మొత్తం 125 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని