logo

జూ.ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అర్ధరాత్రి అభిమానుల హంగామా

సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు అర్ధరాత్రి హల్‌చల్‌ చేశారు.

Published : 21 May 2022 06:00 IST

లాఠీఛార్జి చేస్తున్న పోలీసులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు అర్ధరాత్రి హల్‌చల్‌ చేశారు. శుక్రవారం జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా అభిమానులు గురువారం రాత్రి 11 గంటల నుంచే ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ జిందాబాద్‌, హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్‌, సీఎం అంటూ నినాదాలు చేశారు. కేక్‌ తీసుకొచ్చి కట్‌ చేసి పంచారు. టపాసులు పేల్చారు. అతి సమీపంలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి నివాసం ఉంది. గురువారం సాయంత్రమే ఉపరాష్ట్రపతి జూబ్లీహిల్స్‌లోని ఇంటికి చేరుకున్నారు. ఎన్టీఆర్‌ అభిమానులు వెంకయ్యనాయుడు నివాసం వైపు వెళ్లకుండా బారికేడ్లు, అదనపు సిబ్బందిని మోహరించారు. అభిమానులను దూరంగా పంపేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకపోవడంతో లాఠీలకు పని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని