logo

బదిలీ చేశారు.. వెనక్కి తగ్గారు

ఒకేసారి ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులివ్వడం, ఆ వెంటనే వాటిని రద్దు చేస్తూ పాత స్థానాల్లోనే కొనసాగించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. తొలుత ఎల్బీనగర్‌ ఏసీపీగా పనిచేస్తున్న శ్రీధర్‌రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయంలో

Published : 25 May 2022 02:45 IST

వారంలోపే ఉత్తర్వుల రద్దుతో పోలీసు శాఖలో చర్చనీయాంశం

ఈనాడు, హైదరాబాద్‌, పంజాగుట్ట, న్యూస్‌టుడే: ఒకేసారి ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులివ్వడం, ఆ వెంటనే వాటిని రద్దు చేస్తూ పాత స్థానాల్లోనే కొనసాగించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. తొలుత ఎల్బీనగర్‌ ఏసీపీగా పనిచేస్తున్న శ్రీధర్‌రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఈ నెల 18న ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో సీఐడీలో పనిచేస్తున్న అంజయ్యను నియమించారు. 23న మరోసారి జారీ అయిన ఉత్తర్వుల్లో అంజయ్యను ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌కు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాంతో శ్రీధర్‌రెడ్డి బదిలీ రద్దయింది. అంతకు ఒకరోజు ముందు పంజాగుట్ట సీఐ నిరంజన్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న హరీశ్‌చంద్రారెడ్డిని పంజాగుట్ట సీఐగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాలుగు రోజులు గడవకముందే పాత ఆదేశాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో హరీశ్‌చంద్రారెడ్డి రిలీవ్‌ కాగా.. ఆయన స్థానంలో నిరంజన్‌రెడ్డి మంగళవారం మళ్లీ బాధ్యతలు చేపట్టారు. పంజాగుట్ట ఏసీపీగా పనిచేస్తున్న గణేశ్‌ను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్‌ చేస్తూ.. ఆయన స్థానంలో హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న నర్సింగరావును నియమిస్తూ గత శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వులూ రద్దయ్యాయి. గణేశ్‌ బదిలీ కూడా ఆగిపోయింది. రాజకీయ ప్రమేయంతోనే బదిలీలు రద్దయి ఉంటాయని శాఖలో చర్చ సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని