logo

కర్బన ఉద్గారాలకు చెక్‌

ద్విచక్రవాహనం ఒక కిలోమీటర్‌ ప్రయాణిస్తే 113 గ్రాముల కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల చేస్తుంది. గ్రేటర్‌లో 72.50 లక్షల వాహనాలుంటే 70 శాతం బైకులే. ఈ లెక్కన ఏ మేరకు కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయో అంచనా

Published : 27 Jun 2022 02:40 IST

కాలుష్య రహిత రవాణా సేవలందిస్తోన్న హాలా సంస్థ

ఈనాడు, హైదరాబాద్‌: ద్విచక్రవాహనం ఒక కిలోమీటర్‌ ప్రయాణిస్తే 113 గ్రాముల కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల చేస్తుంది. గ్రేటర్‌లో 72.50 లక్షల వాహనాలుంటే 70 శాతం బైకులే. ఈ లెక్కన ఏ మేరకు కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయో అంచనా వేసుకోవచ్చు. హోం డెలివరీలు, బైక్‌టాక్సీలు పెరగడంతో కాలుష్య ఉద్గారాలు అంతేవిడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ‘నెట్‌జీరో ఎమిషన్‌(కాలుష్య రహితమే)’ లక్ష్యంగా ఏర్పడింది నగరానికి చెందిన ‘హాలా మొబిలిటీ’ అంకుర సంస్థ. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు విద్యుత్‌ వాహనాలను అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తోంది. సేవలను గుర్తించిన నాగ్‌పూర్‌కు చెందిన ‘లెమన్‌ ఐడియాస్‌’ సంస్థ ‘ఇన్నోపెన్యుయర్‌ అవార్డు’ అందించింది.

ఈ-కామర్స్‌లో  విద్యుత్‌ వాహనాలు...
ఆర్టీఏ లెక్కల ప్రకారం నగరంలో 13 వేల ఎలక్ట్రిక్‌ వాహనాలుండగా.. అందులో 11 వేల బైకులున్నాయి. ఈ సంఖ్యను పెంచి జీరో ఎమిషన్‌ నగరంగా మార్చడమే లక్ష్యమని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. తొలుత ఐదు వాహనాలతో ప్రారంభమై ప్రస్తుతం వందలాది వాహనాలతో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలకు విస్తరించింది.  

90 సొంత ఛార్జింగ్‌ స్టేషన్లు: మోహిత్‌, హాలా సంస్థ ప్రతినిధి
రైడింగ్‌, రెంటల్‌, డెలివరీ సంస్థలకు రైడర్‌, వాహన సర్వీసులు అందిస్తున్నాం. స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్‌, డంజో, బిగ్‌బాస్కెట్‌, ఆల్‌మండ్‌హౌజ్‌, ఐఎస్‌బీ, పోలీస్‌, ఐఐఐటీ, జెప్టో, జొమాటో, రెబెల్‌ ఫుడ్స్‌, ఓయో, మెడ్‌ప్లస్‌ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. నగరంలో 90 ఛార్జింగ్‌ స్టేషన్లు నెలకొల్పాము. బ్యాటరీ మొత్తం ఛార్జీ అవడానికి కేవలం రెండు యూనిట్ల విద్యుత్తు అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని