logo

చిత్ర వార్తలు

ఓ వైపు విద్యుదుత్పత్తి క్రమంలో పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. మరోవైపు ఏటా పెరుగుతున్న ఛార్జీలు వినియోగదారులను సౌర పలకలవైపు అడుగేసేలా చేస్తున్నాయి.

Published : 30 Jun 2022 03:32 IST

సౌర కుటుంబాలు

ఓ వైపు విద్యుదుత్పత్తి క్రమంలో పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. మరోవైపు ఏటా పెరుగుతున్న ఛార్జీలు వినియోగదారులను సౌర పలకలవైపు అడుగేసేలా చేస్తున్నాయి. గతంలో ఒకటి రెండు కుటుంబాలు, భవనాల్లోనే సౌర పలకలు ఉండగా ప్రస్తుతం గేటెడ్‌ కమ్యూనిటీలు, సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. కూకట్‌పల్లి మలేసియన్‌ టౌన్‌షిప్‌లో భవనాలపై ఏర్పాటు చేసుకున్న పలకలు ఇవి.


కూడళ్ల సుందరీకరణలో భాగంగా సంబంధిత అధికారులు పలు ఆకృతులను ఏర్పాటుచేస్తున్నారు. ఖాజాగూడ నుంచి నానక్‌రాంగూడ వెళ్లే బాహ్యవలయ కూడలిలో ఇనుముతో తయారుచేసిన మనిషి ఆకృతిని ఏర్పాటుచేశారు. త్వరలో దీనిని ప్రారంభించనున్నారు.


కాకులు దూరని కాంక్రీట్‌ జంగిల్‌!

బహుళ అంతస్థుల భవనాలతో నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. ప్రతిష్థాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేక ఆకర్శణగా కనిపిస్తున్న చిత్రమిది.


సర్కారు బడి.. కళకళలాడి

యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళకళలాడుతోంది. సుమారు 1200 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలలో విద్యనభ్యసిస్తున్నారు. 36 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మెట్రో మార్గాన్ని పాఠశాల ఆవరణలో నుంచే నిర్మించారు. పైన మెట్రో పరుగు పెడుతుండగా కింద విద్యార్థులు ఆటపాటలతో ఆవరణ సందడిగా మారింది.


కంచికి చేరిన కథ

కూడళ్లలో ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్‌ పోస్టులు తయారు చేయించారు. క్రమంగా యూ టర్న్‌ల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో వీటి అవసరం లేకుండా పోతోంది. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో ఓ మైదానంలో వృథాగా పడేశారు.


ఆకాశ హర్మ్యాలు.. అందాల భవనాలు

మహా నగర స్వరూపం మారిపోతోంది. అభివృద్ధి చెందిన దేశాల నగరాలను మరపిస్తూ భారీ భవంతులు వెలుస్తున్నాయి. ఆకాశాన్ని అంటేలా ఐటీ కార్యాలయాలతో కనుచూపు మేర అందమైన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. బయోడైవర్సిటీ, నాలెడ్జి సిటీ తదితర ప్రాంతాల్లో అసలు ఇది హైదరాబాదేనా అని ఆశ్చర్యపోయేలా ఆకట్టుకుంటున్నాయి. ఈ మార్గాల్లో వెళ్లే వారు వీటిని చూస్తూ సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు.


వ్యవసాయ పొలమే

కల్యాణ వేదిక అనుకునేరు? ఇదొక వ్యవసాయ క్షేత్రం. తన పొలంలో పెంచిన పుష్పాలతో ఇలా అలంకరించి చిన్నపాటి శుభకార్యాలకు వేదికగా ఇస్తున్నారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌కు చెందిన రైతు నాగరత్నం నాయుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని