logo

సాఫ్ట్‌వేర్‌ కొలువు పేరుతో మోసం

సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువు పేరుతో మోసానికి పాల్పడిన ఓ సంస్థ నిర్వాహకుడిపై బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్‌ నంబరు 12లో కెరీర్‌ క్రాఫ్ట్స్‌ పేరుతో కన్సల్టెన్సీ కార్యాలయాన్ని కపులూరు గోపీరెడ్డి నిర్వహించేవాడు.

Published : 06 Jul 2022 02:11 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువు పేరుతో మోసానికి పాల్పడిన ఓ సంస్థ నిర్వాహకుడిపై బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్‌ నంబరు 12లో కెరీర్‌ క్రాఫ్ట్స్‌ పేరుతో కన్సల్టెన్సీ కార్యాలయాన్ని కపులూరు గోపీరెడ్డి నిర్వహించేవాడు. ఏలూరు జిల్లా నూజువీడు మండలం మిట్టగూడెంవాసి మారీడు వేణుగోపాల్‌రావు 2018లో బీసీఏ పూర్తిచేసిన తన సోదరి వరుసైన కొచ్చర్ల మేరీ శిరీష కోసం గోపీరెడ్డిని కలిశాడు. ఓ ఐటీ సంస్థలో ఉద్యోగమిప్పిస్తానని, రూఏ.2.50 లక్షలు కన్సల్టెన్సీ ఛార్జిగా ఇవ్వాలని అతడు తెలిపాడు. రూ.1.8లక్షలు మే 21న చెల్లించారు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహించడంతో పాటు ఆఫర్‌ లెటర్‌ తెప్పించాడు. అనంతరం సమాచారం లేదు. ఈనెల 26న గోపీరెడ్డికి ఫోన్‌ చేయగా అందుబాటులో లేదు. అనంతరం సంస్థ బోర్డు తిప్పేసినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ఇలాగే మోసపోయామని పసుమర్తి వరుణ్‌, శ్రీనివాసరావు, శ్రవణ్‌కుమార్‌ ఫిర్యాదుచేశారు. నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని