logo

అటు కొవిడ్‌.. ఇటు డెంగీ!

కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వారం రోజులుగా గాంధీ ఆసుపత్రి చిన్నపిల్లల ఓపీకి తాకిడి పెరిగింది.

Published : 07 Aug 2022 02:05 IST

గాంధీకి పెరిగిన రోగుల తాకిడి

ఈనాడు, హైదరాబాద్‌: కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వారం రోజులుగా గాంధీ ఆసుపత్రి చిన్నపిల్లల ఓపీకి తాకిడి పెరిగింది. నిత్యం 50-60 మంది పిల్లలు ఓపీలో సేవలు పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా కొవిడ్‌తోపాటు డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం లేదన్నారు. ప్రస్తుతం డెంగీతో ఇద్దరు, కొవిడ్‌ లక్షణాలతో మరో ఇద్దరు చిన్నారులు గాంధీ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్నారు. క్రమేపీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పిల్లల్లో సైతం లక్షణాలు కన్పిస్తున్నాయి. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా గాంధీలో పిల్లల కోసం 20 పడకలతో కొవిడ్‌ వార్డు ప్రారంభించారు. 12 ఏళ్లు దాటిన పిల్లలకు కరోనా టీకా ఇప్పించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని