logo

జెండాల పంపిణీ నేటి నుంచే: జీహెచ్‌ఎంసీ

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మంగళవారం ఇంటింటికి జాతీయ పతాకాన్ని పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతి కుటుంబం వజ్రోత్సవాలు ముగిసేవరకు తమ ఇంటిపై ఎగురవేయాలని సూచించారు.

Published : 09 Aug 2022 02:50 IST

విద్యుద్దీపాల్లో బల్దియా ప్రధాన కార్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌:  స్వతంత్ర భారత వజ్రోత్సవాల ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మంగళవారం ఇంటింటికి జాతీయ పతాకాన్ని పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతి కుటుంబం వజ్రోత్సవాలు ముగిసేవరకు తమ ఇంటిపై ఎగురవేయాలని సూచించారు. నియమావళి అనుసరించి పతాకావిష్కరణ చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జెండా ఆవిష్కరించినా, అవమానించడం, అగౌరవపరచడం వంటి ఘటనలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ హెచ్చరించారు.  
80 పార్కుల్లో ప్రత్యేక ఏర్పాట్లు.. జీహెచ్‌ఎంసీ పార్కుల విభాగం నగరంలోని 75 పార్కులను ఫ్రీడం పార్కులుగా ప్రకటించి, ప్రవేశ ద్వారాలకు, బల్లలకు, వృక్షాల మొదళ్లకు మువ్వన్నెల రంగులు వేస్తోంది. బుధవారం ఎంపిక చేసిన పార్కుల్లో మొక్కలు నాటనుంది. మరో ఐదు పార్కుల్లోనూ ఏర్పాట్లు చేయనున్నామంది. కాలిబాటల పొడవునా విద్యుద్దీపాలు, స్వతంత్రోద్యమ గేయాలు వినిపించేటట్లు స్పీకర్లు ఏర్పాటు చేయనుంది.

పోలీసులూ భాగస్వామ్యం కావాలి: సీపీ
అందరిలో దేశభక్తి పెంపొందించేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో పోలీసులు భాగస్వాములు కావాలని నగర సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. సోమవారం సీపీ నగరంలోని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వోలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ట్రాఫిక్‌ ఆపి జాతీయగీతం ఆలపించేలా చర్యలు, ప్రతి ఠాణా పరిధిలో విద్యార్థులకు ఆటలపోటీలు తదితర కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని