logo

బాలుడికి హెచ్‌ఐవీ ఘటనలో రక్తనిధి కేంద్రానికి నోటీసు

బాలుడి(3)కి ఎక్కించిన రక్తంలో హెచ్‌ఐవీ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో రక్తనిధి కేంద్రానికి పోలీసులు నోటీసు జారీ చేశారు. నల్లకుంట సీఐ రవి వివరాల ప్రకారం.. కీసరకు చెందిన బాలుడికి

Published : 10 Aug 2022 02:45 IST

నల్లకుంట: బాలుడి(3)కి ఎక్కించిన రక్తంలో హెచ్‌ఐవీ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో రక్తనిధి కేంద్రానికి పోలీసులు నోటీసు జారీ చేశారు. నల్లకుంట సీఐ రవి వివరాల ప్రకారం.. కీసరకు చెందిన బాలుడికి తలసీమియా ఉండడంతో  విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్‌రక్తనిధి కేంద్రంలో రక్త మార్పిడి చేయిస్తున్నారు. గత నెలలో రక్తమార్పిడి తర్వాత బాలుడిని పరీక్షించగా హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చింది.  కేంద్రంపై కేసు నమోదుచేసిన పోలీసులు మంగళవారం నోటీసు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని