logo

యెమెన్‌ దేశానికి వెళ్లిన వ్యక్తిపై కేసు

భారత విదేశాంగ శాఖ నిబంధనలను ఉల్లంఘించి యెమెన్‌ దేశానికి వెళ్లిన వ్యక్తిని గురువారం శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వారు తెలిపిన కథనం ప్రకారం.. ఏపీలోని తూగో

Published : 12 Aug 2022 03:56 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: భారత విదేశాంగ శాఖ నిబంధనలను ఉల్లంఘించి యెమెన్‌ దేశానికి వెళ్లిన వ్యక్తిని గురువారం శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వారు తెలిపిన కథనం ప్రకారం.. ఏపీలోని తూగో జిల్లా కాకినాడకు చెందిన రాజేశ్‌ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యెమెన్‌ దేశానికి వెళ్లి, రెండేళ్లకు పైగా ఉన్నాడు. తిరిగి దుబాయ్‌ మీదుగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో స్వదేశానికి బయల్దేరాడు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకొన్న రాజేశ్‌ పాస్‌పోర్ట్‌, వీసా పత్రాలను పరిశీలించగా యెమెన్‌ దేశానికి వెళ్లినట్లు తేలింది. అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని