logo

జల్సాలకు అలవాటుపడి చోరీల బాట

రాత్రి వేళ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురిని ఎల్బీనగర్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డీఐ ఉపేందర్‌రావు కథనం ప్రకారం... సూర్యోదయనగర్‌లో నివసించే నడిపల్లి శిశుపాల్‌(33) ఈ నెల 1న  ఎల్బీనగర్‌లో ఒంటరిగా

Published : 14 Aug 2022 03:13 IST

నాగోలు, న్యూస్‌టుడే: రాత్రి వేళ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురిని ఎల్బీనగర్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డీఐ ఉపేందర్‌రావు కథనం ప్రకారం... సూర్యోదయనగర్‌లో నివసించే నడిపల్లి శిశుపాల్‌(33) ఈ నెల 1న  ఎల్బీనగర్‌లో ఒంటరిగా నడిచి ఇంటికి వెళ్తుండగా.. రెండు బైకులపై వచ్చిన నలుగురు యువకులు అటకాయించారు. జేబులన్నీ వెతికారు. వెండి మొలతాడుతోపాటు కొంత నగదును లాక్కుని పరారయ్యారు. బాధితుని ఫిర్యాదుమేరకు పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. శనివారం సాగర్‌రింగురోడ్డు చౌరస్తా వద్ద ఆ నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు నేరం బయటపడింది. వీరిలో ఓర్సు మహేష్‌(21) గుర్రంగూడ సమీపంలోని శ్రీ అవెన్యూ కాలనీలో, మోటం అర్జున్‌(21), కొమ్మూరి మణికంఠ(23), అనిమల్ల జలేందర్‌(20) సమీపంలోని శ్రీనివాసపురంలో ఉంటున్నారు. ముఠాలోని బాలకృష్ణ అనే మరో నిందితుడితో కలిసి నారపల్లి, ఉప్పల్‌ ప్రాంతాల్లో పలు దొంగతనాలు  చేశారు. రూ.50వేల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ పరారీలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని