logo

నన్నయ్య సాహిత్యాన్ని నవతరానికి అందించాలి

 రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూనుకొని ఆదికవి నన్నయ్య సాహిత్యాన్ని నవతరానికి అందించాలని హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కోరారు. రాసి కేర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో శనివారం పొట్టి శ్రీరాములు

Published : 14 Aug 2022 06:39 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే:  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూనుకొని ఆదికవి నన్నయ్య సాహిత్యాన్ని నవతరానికి అందించాలని హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కోరారు. రాసి కేర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ‘శ్రీమదాంద్ర మహాభారత అవతరణ సహస్రాబ్ది, నన్నయ్య సహస్రాబ్ది మహోత్సవాలు’ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా దత్తాత్రేయ హాజరై ‘నన్నయ్య వాజ్ఞ్మయ పూర్ణిమ’ సహాస్రాబ్ది మహోత్సవ విశేష సంచికను ఆవిష్కరించి మాట్లాడారు.మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ..మనమంతా సంతకాలు ఆంగ్లంలో కాకుండా తెలుగులో చేసినప్పుడే నన్నయ్యకు నిజమైన నివాళి అన్నారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, నటుడు బ్రహ్మానందం మాట్లాడారు.  భాజపా నేత సత్యకుమార్‌, ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, మహామహోపాధ్యాయ శలాక రఘునాథశర్మ, భాస్కరయోగి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, అమరేశం రాజేశ్వరశర్మ, డా.కె.సుహాసిని ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని