logo

మురుగుశుద్ధి నిర్వహణ భేష్‌: కేటీఆర్‌

‘‘మురుగు శుద్ధి నిర్వహణలో హైదరాబాద్‌ నగరం బాగుంది. జలమండలి అధికారులు బాగా పనిచేస్తున్నారు’’ అని పురపాలక, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఫతేనగర్‌, కోకాపేటల్లో జలమండలి అధికారులు నిర్మిస్తున్న మురుగుశుద్ధి నిర్వహణ

Updated : 25 Sep 2022 04:28 IST

భద్రత నిర్వహణ వాహనాలను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌ చిత్రంలో అర్వింద్‌కుమార్‌, దానకిశోర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మురుగు శుద్ధి నిర్వహణలో హైదరాబాద్‌ నగరం బాగుంది. జలమండలి అధికారులు బాగా పనిచేస్తున్నారు’’ అని పురపాలక, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఫతేనగర్‌, కోకాపేటల్లో జలమండలి అధికారులు నిర్మిస్తున్న మురుగుశుద్ధి నిర్వహణ కేంద్రాలను పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జలమండలి ఎండీ ఎం.దానకిశోర్‌,  అధికారులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం కోకాపేటలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన భద్రత పర్యవేక్షణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. పని ప్రదేశంలో భద్రత.. ప్రజల భద్రత(వర్క్‌ సైట్‌ సేఫ్టీ ఈజ్‌ పబ్లిక్‌ సేఫ్టీ) అన్న నినాదంతో జలమండలి చేపట్టే వివిధ పనులను భద్రత పర్యవేక్షణ వాహనాల బృందం నిరంతరం పరిశీలిస్తుందని జలమండలి ఎండీ దానకిశోర్‌ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. దేశంలోనే తొలిసారిగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పని ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఆలోచనతోనే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫతేనగర్‌లో నిర్మించనున్న ఎస్టీపీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని