logo

నింపేసెయ్‌.. అమ్మేసెయ్‌!

జనావాసాల్లో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ భయభ్రాంతులకు గురి చేస్తోంది. పౌర సరఫరాలశాఖ, పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడటం లేదు. ఇటీవల కోకాపేట్‌లో జరిగిన ఘటన కనువిప్పు కలగాలని హెచ్చరిస్తోంది.

Updated : 30 Sep 2022 03:30 IST

నావాసాల్లో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ భయభ్రాంతులకు గురి చేస్తోంది. పౌర సరఫరాలశాఖ, పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడటం లేదు. ఇటీవల కోకాపేట్‌లో జరిగిన ఘటన కనువిప్పు కలగాలని హెచ్చరిస్తోంది.

* జనావాసాలుండే బస్తీలో దందా నిర్వహిస్తుండటం అందులోనూ పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు గ్యాస్‌ను రీఫిల్‌ చేసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిప్పంటుకుని ఇద్దరికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 10 సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* ఈ ఏడాది జులైలోనే జవహర్‌నగర్‌ గబ్బిలాలపేట్‌ సమీపంలో రీఫిల్లింగ్‌ దందా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్‌చేసి 12 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట్‌ కేంద్రంగా పెద్ద ఎత్తున దందా నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మే లో పోలీసులు దాడులు చేసి ఏకంగా 115 సిలిండర్లు స్వాధీనం చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.  

* గ్యాస్‌ను పెద్దగా వినియోగించని ఖాతాదారుల నుంచి సిలిండర్లు కొనుగోలు చేసి, రీఫిల్లింగ్‌ బుకింగ్‌ చేసి అధిక ధరలతో ఇతరులకు అమ్మేస్తున్నారు. ముఖ్యంగా 5 కేజీల సిలిండర్లలోకి రీఫిల్‌తో దందాచేసి జేబులు నింపుకొంటున్నారు. ఇది పధానంగా అమీర్‌పేట్‌, సింగరేణికాలనీ, బోరబండ, తార్నాక సమీపం మాణికేశ్వర్‌ నగర్‌, విద్యానగర్‌, పాతనగరంలోని కొన్ని బస్తీల్లో ప్రధాన సమస్యగా పరిణమించింది. రీఫిల్లింగ్‌ దందాను చేసేవారి సమాచారాన్ని ఆయా సర్కిల్‌ అధికారులకు అందించాలని.. వారిపై చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని