logo

గంజాయ్‌ గుప్పు..గుప్పు!

అతడో గంజాయి స్మగ్లర్‌.. కేరాఫ్‌ ధూల్‌పేట్‌. ఇతడి కుటుంబసభ్యుల్లో 8 మంది ఇదే దందా. సుమారు 100మంది ఏజెంట్లతో నగరవ్యాప్తంగా సరకు చేరవేస్తుంటాడు. పీడీయాక్ట్‌పై జైలుకెళ్లి 2నెలల క్రితమే బయటకు వచ్చాడు. నానక్‌రామ్‌గూడకు మకాం మార్చి మత్తు

Published : 01 Oct 2022 03:11 IST

ధూల్‌పేట్‌ కేంద్రంగా పెరిగిన విక్రయాలు

ఈనాడు, హైదరాబాద్‌ గోషామహల్‌, న్యూస్‌టుడే: అతడో గంజాయి స్మగ్లర్‌.. కేరాఫ్‌ ధూల్‌పేట్‌. ఇతడి కుటుంబసభ్యుల్లో 8 మంది ఇదే దందా. సుమారు 100మంది ఏజెంట్లతో నగరవ్యాప్తంగా సరకు చేరవేస్తుంటాడు. పీడీయాక్ట్‌పై జైలుకెళ్లి 2నెలల క్రితమే బయటకు వచ్చాడు. నానక్‌రామ్‌గూడకు మకాం మార్చి మత్తు కార్యకలాపాలు ప్రారంభించాడు. నగరంలో మాదకద్రవ్యాల  వినియోగంతో గంజాయికు డిమాండ్‌ పెరగడంతో ధూల్‌పేట్‌లో చాలా కుటుంబాలు గంజాయి విక్రయాలు ప్రారంభించాయి. 22 కుటుంబాల్లోని సభ్యులంతా దీన్నే వృత్తిగా తీసుకున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడే పోలీసు, ఎక్సైజ్‌ సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా వ్యాపారం చేశారు. గతంలో అక్కడ పనిచేసిన ఒక ఇన్‌స్పెక్టర్‌కు ప్రతినెలా గంజాయి, సట్టా వ్యాపారులు రూ.5-6లక్షలు మామూళ్లు సమర్పించుకునేవారు. ఉన్నతాధికారుల విచారణలో సదరు ఇన్‌స్పెక్టర్‌ అవినీతి బయటపడటంతో సస్పెన్షన్‌ వేటుకు గురయ్యాడు.

జైలుకెళ్లొచ్చినా మారని బుద్ధి.. మత్తుపదార్థాల సరఫరాకు అడ్టుకట్ట వేసేందుకు పోలీసు, అబ్కారీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయి. గంజాయి రవాణాలో కీలకమైన 30-35 మందిపై పీడీయాక్ట్‌ ప్రయోగించి ఏడాది జైలులో ఉంచారు. అధికశాతం మళ్లీ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కొందరు శివార్లలో అపార్ట్‌మెంట్లు అద్దెకు తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. ధూల్‌పేట్‌కు చెందిన కొన్ని ముఠాలు తమ స్థావరాలను నానక్‌రాంగూడ, గచ్చిబౌలి, నిజాంపేట్‌, బీహెచ్‌ఈఎల్‌ తదితర ప్రాంతాలకు మార్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని