logo

విద్యార్థులకు నాణ్యమైన భోజనం తప్పనిసరి: కలెక్టర్‌

గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులను వసతిగృహ సంక్షేమాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ సొంత పిల్లల మాదిరిగా చూసుకోవాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ గురుకుల పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ

Published : 01 Oct 2022 03:11 IST

మాట్లాడుతున్న పాలనాధికారిణి నిఖిల, చిత్రంలో అధికారులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులను వసతిగృహ సంక్షేమాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ సొంత పిల్లల మాదిరిగా చూసుకోవాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ గురుకుల పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన భోజనం అందించాలన్నారు.  పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. సేవాభావంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈనెల 6,7 తేదీల్లో వసతి గృహాల్లో, పాఠశాలల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల సంక్షేమాధికారులు మల్లేశం, కోటాజీ, సంధ్యారాణి, ఇంటర్‌మీడియట్‌ నోడల్‌ అధికారి శంకర్‌, అపర్ణ, యాసిన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని