logo

విద్యార్థులెంతమంది? ద్వారాలెన్ని?

‘మీ విద్యాసంస్థలో విద్యార్థులెంతమంది? ఎన్ని ద్వారాలున్నాయి? నిప్పంటుకుంటే వేగంగా బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లున్నాయి? రెండంతస్థులకు అనుమతులు తీసుకున్నారా? ప్రాథమిక చికిత్స సామగ్రి ఉందా?..’అంటూ అగ్నిమాపకశాఖ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను ప్రశ్నించనున్నారు.

Published : 24 Nov 2022 01:50 IST

ఈనాడు, హైదరాబాద్‌

‘మీ విద్యాసంస్థలో విద్యార్థులెంతమంది? ఎన్ని ద్వారాలున్నాయి? నిప్పంటుకుంటే వేగంగా బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లున్నాయి? రెండంతస్థులకు అనుమతులు తీసుకున్నారా? ప్రాథమిక చికిత్స సామగ్రి ఉందా?..’అంటూ అగ్నిమాపకశాఖ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను ప్రశ్నించనున్నారు. గ్రేటర్‌ పరిధిలో 20 అడుగులు ఆపై ఎత్తున్న భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 90శాతం సంస్థలు అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోలేదు. దీంతో పాఠశాలలు, కోచింగ్‌ కేంద్రాలు తప్పనిసరిగా అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటూ అగ్నిమాపకశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. డిసెంబరు తొలివారం నుంచి తనిఖీలు నిర్వహించనున్నామని లోపాలుంటే విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామంటూ వివరిస్తున్నారు.

ఎన్వోసీ లేకపోతే గుర్తింపు రద్దు..

గ్రేటర్‌ పరిధిలోని చాలా సంస్థలు నిరభ్యంతర పత్రాలు తీసుకోలేదని గుర్తించారు. బడులు, కళాశాలల్లో వందల సంఖ్యలో విద్యార్థులుంటారు. వారు సురక్షితంగా ఉండేందుకు వీలుగా.. అన్ని విద్యాసంస్థలు అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, అగ్నిమాపక సేవల చట్టం మేరకు ఇది తప్పనిసరి అంటూ విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. అధికారులు జోన్ల వారీగా విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని