logo

చైనాతో సరిహద్దు సంక్షోభంపై అమెరికాకే ఎక్కువ సమాచారం

చైనాతో దేశ సరిహద్దులో ఏం జరుగుతుందో యావత్‌ ప్రపంచానికి తెలుసని, ఈ విషయాల్ని భారతీయులకు వివరించకుండా మోదీ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతోందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు.

Published : 02 Dec 2022 02:24 IST

అసదుద్దీన్‌ ఒవైసీ

అబిడ్స్‌, న్యూస్‌టుడే: చైనాతో దేశ సరిహద్దులో ఏం జరుగుతుందో యావత్‌ ప్రపంచానికి తెలుసని, ఈ విషయాల్ని భారతీయులకు వివరించకుండా మోదీ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతోందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. గురువారం ఆయన ట్వీట్‌ చేస్తూ..1962 నాటి చైనాతో యుద్ధం పరిస్థితుల్ని పార్లమెంటులో చర్చనీయాంశంగా చేయగలిగినట్లు.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని మోదీ ఎందుకు ప్రకటన చేయడం లేదని ధ్వజమెత్తారు. సరిహద్దులో చైనాతో నెలకొన్న అంశాలు మన కంటే ఎక్కువగా అమెరికా పార్లమెంటుకే అధికారికంగా సమాచారం ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జీ-20 శిఖరాగ్ర సదస్సులో మాట్లాడేందుకే వీటిని ఇంత వరకు మోదీ బయటపెట్టలేదన్న అనుమానం మరింత బలపడిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని