logo

Hyderabad Metro: అతిపెద్ద మెట్రో కారిడార్‌ ఇదే!

నగర ఆధునిక ప్రజారవాణాలో మరో ముందడుగు పడింది.  మెట్రో.. మరిన్ని ప్రాంతాలకు విస్తరించే రెండోదశ ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపనతో ఆయా ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated : 10 Dec 2022 12:17 IST

రాయదుర్గం-శంషాబాద్‌ ప్రాంతవాసుల హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: నగర ఆధునిక ప్రజారవాణాలో మరో ముందడుగు పడింది.  మెట్రో.. మరిన్ని ప్రాంతాలకు విస్తరించే రెండోదశ ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపనతో ఆయా ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  శంషాబాద్‌ నుంచి సిటీలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని ఉన్నతోద్యోగులు నిత్యం పెద్దసంఖ్యలో విమానాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోతో వీరు 26 నిమిషాల్లో విమానాశ్రయం చేరుకోవచ్చు.  దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు శంషాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌ వద్ద దిగి గచ్చిబౌలికి వస్తుంటారు. మెట్రో పూర్తైతే వీరి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

అన్నివైపులా అనుసంధానం..

ఎక్స్‌ప్రెస్‌ మెట్రో.. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కి కొనసాగింపు. ఈ కారిడార్‌-3తో ఇప్పటికే కారిడార్‌1, 2.. అమీర్‌పేట, ఎంజీబీఎస్‌, పరేడ్‌గ్రౌండ్స్‌ వద్ద అనుసంధానమై ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని