Telangana News: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 26 Jan 2023 01:17 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 91 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరిలో 51 మంది ఐపీఎస్‌, 40 మంది నాన్‌ కేడర్‌ అధికారులు ఉన్నారు.  ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సంయుక్త కమిషనర్‌గా సత్యనారాయణ, హైదరాబాద్‌ సంయుక్త కమిషనర్‌గా గజరావు భూపాల్‌, రామగుండం కమిషనర్‌గా రెమా రాజేశ్వరి, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డైరెక్టర్‌గా ప్రకాశ్‌రెడ్డి, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా అభిషేక్‌ మహంతి, శాంతి భద్రతల ఏఐజీగా సన్‌ప్రీత్‌ సింగ్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా విజయ్‌కుమార్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా విశ్వజిత్‌ కంపాటి, అనిశా జేడీగా ఛేతన, కరీంనగర్‌ సీపీగా సుబ్బారాయుడు, శంషాబాద్‌ డీసీపీగా నారాయణరెడ్డి, మేడ్చల్‌ ట్రాఫిక్‌ డీసీపీగా డీవీ శ్రీనివాసరావు, బాలానగర్‌ డీసీపీగా టి.శ్రీనివాసరావు, విజిలెన్స్‌ ఎస్పీగా అన్నపూర్ణ, మహిళా భద్రతా విభాగం ఎస్పీగా పద్మజ, పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా జానకి షర్మిల, మల్కాజ్‌గిరి డీసీపీగా జానకి ధరావత్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హెగ్డే, నల్గొండ ఎస్పీగా అపూర్వరావు, హైదరాబాద్‌ తూర్పు మండలం డీసీపీగా సునీల్‌ దత్‌, మమనూరు టీఎస్‌ఎస్పీ కమాండెంట్‌గా సింధుశర్మ, సీఐడీ ఎస్పీగా యాదగిరి, వనపర్తి ఎస్పీగా రక్షితామూర్తి, ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా పాటిల్‌ సంగ్రామ్‌ సింగ్, యాదాద్రి డీసీపీగా రాజేశ్‌ చంద్ర, సీఐడీ ఎస్పీలుగా ఎం.నారాయణ, వి. తిరుపతి, హైదరాబాద్‌ దక్షిణ మండల డీసీపీగా సాయి చైతన్య,  హైదరాబాద్‌ క్రైమ్‌ డీసీపీగా శబరిశ్‌, ములుగు ఎస్పీగా గౌస్‌ అలం, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా అఖిల్‌ మహజన్‌, హైదరాబాద్‌ సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా కె.కె ప్రభాకర్‌, హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా రూపేశ్‌, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డైరెక్టర్‌గా ప్రకాశ్‌రెడ్డి బదిలీ అయిన వారిలో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని