పుస్తకమేదైనా.. కళ్లు మూసుకొని తీసుకునేలా!
లైబ్రరీలు లేని పాఠశాలల్లో ఓ చిన్నపాటి గ్రంథాలయ ఉద్యమాన్ని మొదలుపెట్టిన ‘ఫుడ్ ఫర్ థాట్’ అనే సంస్థ సరికొత్త ప్రయోగం చేపట్టింది.
ఆకట్టుకుంటున్న ‘ఫుడ్ ఫర్ థాట్’ సంస్థ పథం
బ్లైండ్ డేట్ విత్ బుక్ స్టాల్
ఈనాడు, హైదరాబాద్: లైబ్రరీలు లేని పాఠశాలల్లో ఓ చిన్నపాటి గ్రంథాలయ ఉద్యమాన్ని మొదలుపెట్టిన ‘ఫుడ్ ఫర్ థాట్’ అనే సంస్థ సరికొత్త ప్రయోగం చేపట్టింది. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో ‘పుస్తకంతో బ్లైండ్ డేట్’ అంటూ ముందుకొచ్చింది. ఈ ఫెస్ట్‌కు వచ్చే పుస్తక ప్రియులను ఆహ్వానిస్తూ ఇద్దరు వలంటీర్లు ‘వాంటెడ్ బుక్ లవర్స్’ అంటూ నిల్చుంటారు. వచ్చినవారిని స్టాల్ నంబర్-1కు తీసుకెళ్లి ‘బ్లైండ్ డేట్ విత్ బుక్’ కాన్సెప్టు పరిచయం చేస్తారు. అక్కడున్న పుస్తకాల కవర్ పేజీలు కనిపించకుండా సీల్ వేస్తారు. అందులోంచి ఏ పుస్తకాన్నైనా ఎంచుకుని తీసుకెళ్లాలి. పుస్తకం తీసుకున్నాక గ్రంథాలయాల ఏర్పాటుకు తోచిన విరాళం ఇవ్వాలన్న మాట.
దేశవ్యాప్తంగా 587 లైబ్రరీల ఏర్పాటు
‘పుస్తకం దానం చేయండి.. ఓ గ్రంథాలయానికి ఊపిరి పోయండి’ అంటూ నగరానికి చెందిన ఫుడ్ ఫర్ థాట్ స్వచ్ఛంద సంస్థ అక్షర ఉద్యమం ప్రారంభించింది. దాతల నుంచి 1,48,759 పుస్తకాల సేకరణతో 587 లైబ్రరీలు ఏర్పాటుచేసింది. ప్రతీ పుస్తకానికి బార్ కోడ్ జోడిస్తూ మొబైల్ యాప్ ద్వారా దాతలు తాము ఇచ్చిన పుస్తకాలను ట్రాక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
పురాణాలు, ఇతిహాసాల చెట్టు
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో ‘క్యూఆర్ కోడ్ ట్రీ’ అందరినీ ఆకర్షించింది. ‘డిజిటైజింగ్ ఎండేంజర్డ్ స్టోరీస్’ పేరుతో పురాణాలు, ఇతిహాసాలు, కథలు తెలిసేలా దీన్ని రూపొందించారు. పలు భాషల్లో ఈ కథలు ఆడియో రూపంలో లభ్యమవుతున్నాయి. చెట్టుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే యూట్యూబ్ లింక్‌కు తీసుకెళ్లేలా రామాయణం, శివపురాణం, కృష్ణ, మహాభారత, హనుమాన్, గణేశ్ అంటూ ఒక్కో క్యూఆర్ కోడ్‌పై ఆడియోలు నిక్షిప్తంచేసినట్లు ఫుడ్ ఫర్ థాట్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ‘షెపాలి రావు’ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం
-
Ts-top-news News
MLC Kavitha: కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ
-
Ts-top-news News
Indian Railway: రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
Ap-top-news News
CM Jagan: సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు.. ఇప్పుడు చిక్కులు..
-
India News
ChatGPT: నిందితుడికి బెయిల్ ఇవ్వాలా.. వద్దా? చాట్‌జీపీటీ సాయం కోరిన హైకోర్టు జడ్జి