Singareni Collieries: బొగ్గు రవాణాలో సింగ‌రేణి సంస్థ ఆల్‌ టైం రికార్డు

బొగ్గు ఉత్పత్తిలో సింగ‌రేణి సంస్థ ఆల్‌ టైం రికార్డు సృష్టించింది. జ‌న‌వ‌రి నెల‌లో రూ. 68.4 ల‌క్షల ట‌న్నుల బొగ్గును ర‌వాణా చేసి సింగ‌రేణి చ‌రిత్రలోనే అరుదైన రికార్డును నమోదు చేసిందని యాజమాన్యం ప్రకటించింది. 2016 మార్చిలో తన పేరుతో ఉన్న రికార్డును అధిగమించి ఆల్‌ టైం రికార్డు సాధించింది.

Published : 01 Feb 2023 17:13 IST

హైదరాబాద్‌: బొగ్గు రవాణాలో సింగ‌రేణి సంస్థ ఆల్‌ టైం రికార్డు సృష్టించింది. జ‌న‌వ‌రి నెల‌లో రూ. 68.4 ల‌క్షల ట‌న్నుల బొగ్గును ర‌వాణా చేసి సింగ‌రేణి చ‌రిత్రలోనే అరుదైన రికార్డును నమోదు చేసిందని యాజమాన్యం ప్రకటించింది. 2016 మార్చిలో చేసిన రూ. 64.70 ల‌క్షల ట‌న్నుల బొగ్గు ర‌వాణాను అధిగమించి రికార్డు నెలకొల్పింది. జ‌న‌వరి నెల‌లో మొత్తం 11 ఏరియాల నుంచి స‌గ‌టున రోజుకు 39 రైళ్లలో మొత్తం 1,216 రేకులతో బొగ్గు ర‌వాణా చేశారు. తెలంగాణ జెన్‌కో సహా మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని థ‌ర్మల్ విద్యుత్ కేంద్రాల‌కు ఎక్కువ శాతం బొగ్గు ర‌వాణా చేసినట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. బొగ్గు ర‌వాణా తోపాటు ఓపెన్ కాస్టు గ‌నుల్లో ఓవ‌ర్ బ‌ర్డెన్ తొల‌గింపులోనూ సింగ‌రేణి కొత్త రికార్డును నెలకొల్పింది. కంపెనీ చ‌రిత్రలో తొలిసారిగా జనవరి 31వ తేదీన ఉద‌యం షిఫ్టు నుంచి రాత్రి షిఫ్టు వ‌ర‌కు అత్యధికంగా 16.67 ల‌క్షల క్యూబిక్ మీట‌ర్ల ఓవ‌ర్ బ‌ర్డెర్‌ను తొల‌గించి సింగరేణి సంస్థ రికార్డు సృష్టించింది. గ‌త నెల‌ జనవరి 30వ తేదీన సాధించిన‌ 15.75 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ ఇప్పటివ‌ర‌కు గ‌రిష్ఠ రికార్డుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు