logo

Hyderabad: అమెరికాలో తెలుగు బుడతడి సత్తా

అమెరికాలో తెలుగు బుడతడు సత్తా చాటాడు. 12 ఏళ్లకే తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. న్యూజెర్సీలోని సోమర్‌సెట్‌లోని సెడార్‌హిల్‌ ప్రిపరేటరీ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న సాహిత్‌ మంగు గార్డెన్‌ స్టేట్‌ డిబేట్‌ లీగ్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు.

Updated : 09 Feb 2023 11:44 IST

సాహిత్‌

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో తెలుగు బుడతడు సత్తా చాటాడు. 12 ఏళ్లకే తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. న్యూజెర్సీలోని సోమర్‌సెట్‌లోని సీడర్ హిల్‌ ప్రిపరేటరీ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న సాహిత్‌ మంగు గార్డెన్‌ స్టేట్‌ డిబేట్‌ లీగ్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. 164 మంది విద్యార్థులు   పోటీపడగా.. సాహిత్‌ గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌గా అవార్డు దక్కించుకున్నాడు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు నిషేధం, అమెరికాలో అందరికీ ఇంటర్నెట్‌, ఫేసియల్‌ టెక్నాలజీ వల్ల చెడు కంటే మంచే ఎక్కువ, మాంసాహారం కంటే శాకాహారమే మంచిది... అనే అంశాలపై  డిబేట్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిన సాహిత్‌ కుటుంబం అక్కడే స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని