logo

లబ్ధిదారుల ఎంపిక.. కార్యాలయం కిటకిట

రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం అందజేయనున్న రుణాల కోసం తాండూరులో నిర్వహించిన మేళాకు దరఖాస్తు దారులు భారీగా తరలి వచ్చారు. మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

Published : 22 Mar 2023 00:36 IST

లాటరీ పద్ధతిలో అర్హుల గుర్తింపు

దరఖాస్తు దారులతో రద్దీగా మున్సిపల్‌ ప్రాంగణం

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం అందజేయనున్న రుణాల కోసం తాండూరులో నిర్వహించిన మేళాకు దరఖాస్తు దారులు భారీగా తరలి వచ్చారు. మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. అధ్యక్షురాలు స్వప్న చేతుల మీదుగా లబ్ధిదారులను ప్రకటించారు. మొత్తం 1194 మంది గతంలో అంతర్జాలం ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1154 మందిని మాత్రమే లాటరీ పద్ధతికి అర్హులుగా గుర్తించారు. వాళ్లలో కేవలం 50 మందిని మాత్రమే ఎంపిక చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ చొప్పున 16 మందికి అవకాశం కల్పించారు.
ః రూ.లక్ష రుణాలకు 36 మంది, దివ్యాంగులతో కలిపి 14 మందిని రూ.2లక్షల రుణాలకు అర్హులుగా గుర్తించారు. ప్రక్రియ పూర్తయ్యే దాకా కార్యాలయం ఆవరణ దరఖాస్తుదారులతో కిటికిట లాడింది. కార్యక్రమంలో మెప్మా అధికారులు రవి కుమార్‌, పురపాలక సంఘం మేనేజరు నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజ, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని